మహాకవి శ్రీశ్రీ
మహాకవి శ్రీశ్రీ గారిని స్మరించుకుంటూ... మరో ప్రపంచం,మరో ప్రపంచం,మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! పదండి ముందుకు పదండి అని ఉవెత్తున లేచి గర్జించిన సింహం వలె అరిచాడు. మరో ప్రపంచం , మరో ప్రపంచం , మరో ప్రపంచం పిలిచింది ! పదండి ముందుకు , పదండి త్రోసుకు ! పోదాం , పోదాం పైపైకి ! కదం తొక్కుతూ , పదం పాడుతూ, హృదంత రాళం గర్జిస్తూ __ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం ? దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు ! బాటలు నడచీ , పేటలు కడచీ , కోటలన్నిటినీ దాటండి ! నదీ నదాలూ , అడవులు , కొండలు , ఎడారులు మన కడ్డంకి ? పదండి ముందుకు ! పదండి త్రోసుకు ! పోదాం పోదాం పైపైకి ! ఎముకలు క్రుళ్లిన , వయస్సు మళ్లిన సోమరులారా ! చావండి ! నెత్తురు మండే , శక్తులు నిండే సైనికులారా ! రారండి ! “ హరోం ! హరోం హర ! హర ! హర ! హర! హర ! హరోం హరా ! “ అని కదలండి ! మరో ప్రపంచం , మహా ప్రపంచం ధరిత్రి నిండా నిండింది ! పదండి ముందుకు , పదండి త్రోసుకు ! ప్రభంజనంవలె హ...