మన తెలుగు భాష గొప్పతనం-వ్యాసం

                        https://qr.ae/TWTa4H

                       మన తెలుగు భాష గొప్పతనం-వ్యాసం

మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. మనం తెలుగు భాష తక్కువ అని అనుకోకూడదు. తెలుగు భాష కి చాలా చరిత్ర ఉంది. తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది. అందులో ఎందరో కవులు, రచయితలు గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు. పర భాష లను గౌరవించడమే తెలుగు భాష, తెలుగు వారి గొప్పతనం. ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికాలోనూ , పశ్చిమ ఆసియా లోనూ,ఆంధ్ర,తెలంగాణ లోనూ జరుగుతాయి. తెలుగువారి మంచి మనసు, వేరే భాషలవారిని ఆదరించే గుణం లోనే తెలుస్తుంది తెలుగు తీపి, తెలుగు వారి గొప్పతనం. తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి. గొప్పవాళ్లు రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు , విప్లవగీతాలు చదవాలి. అన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి. మన పట్టణాలు, పల్లెలు, అక్కడుండే ప్రజలు, విహారయోగ్యమైన ప్రదేశాలు, యాత్రికుల అనుభవాలు, కట్టడాలు, సెలయేర్లు, అడవులు, వన్య ప్రదేశాలు, గుడులు గోపురాలు, ఇంకా నదులు, పుణ్య క్షేత్రాలు,ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మన ప్రదేశాలలో. కానీ మనం అన్నీ చూడలేము. వాటినిగూర్చి మనం తెలుసుకొని ఇంకొకరికి ఆవిషయాలు చెప్పాలి. మన భాష గొప్పతనం ముందర మనం అర్ధం చేసుకొని తరువాత అది తెలియని వారికి చెప్పాలి. మన భాషలో ఎన్నో గొప్ప భక్తి గీతాలు, మహాభారతం, రామాయణం, భాగవతం ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మనం ఈ కాలంలో ఇవేవీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువ మక్కువ చూపడం న్యాయం కాదు పద్ధతి కాదు. అది మాతృ ద్రోహం చేయడమే. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందకురా అంటూ ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన ఆవేదన వ్యక్తం చేసాడు. దేశం లో ఎన్నో భాషలు ఉన్నాయి. ఎవరిభాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపిని ఆస్వాదించ గలిగితే,వారు తప్పకుండ మాతృభాషలకు అభిమానులౌతారు. ఈ కాలం లో పిల్లలు మాతృ భాషను కించపరచరాదు. ఇంగ్లీషు హింది మరి ఇతర భాషలు నేర్చుకోవాలి. కానీ తెలుగు భాషని గౌరవించాలి. తెలుగు భాష దక్షిణ భారత దేశం లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో ని ప్రజల లోకవాక్కు. ఇది చాలా తీయనిది. తెలుగుని "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని పాశ్చ్యతులు కొనియాడారు. తెలుగు వ్యాకరణం చాలా సులభం. సంస్కృతంలో ఉన్న వైభవం తెలుగు లో కూడా ఉంది. తెలుగుని 12కోట్ల తెలుగువాళ్లు మరి ప్రపంచంలో నలు మూలలా వ్యాపించిఉన్న లక్షల మంది తెలుగు వాళ్ళు మాట్లాడతారు. భారత దేశంలో ప్రాచీన హోదా పొందిన భాషల్లో తెలుగు ఒకటి. దేశభాషలందు తెలుగు లెస్స అని అలనాటి చక్రవర్తి శ్రీకృష్ణ
 దేవరాయలు అన్నాడు. ఆయన కాలం లో తెలుగు
 బాగా అభివృద్ధి చెందినది. నన్నయ, తిక్కన, ఎఱ్ఱన
 (ఎఱ్ఱాప్రగడ), తెనాలి రామకృష్ణ కవి, ముక్కునంది తిమ్మన, తిరుపతి వెంకట కవులు, వేమన, బమ్మెర
 పోతన లాంటి మహా మహులు తెలుగులో రచనలు చేసి జాతి గౌరవాన్ని, భాషస్థాయిని ఆకాశానికి ఎక్కించారు.
 త్యాగరాజు కృతులు, అన్నమయ్య కీర్తనలు కోట్లాది మంది నోళ్లలో ఎపుడూ నానుతూనే ఉంటాయి. క్రీస్తు పూర్వం 300 వ సంవత్సరం లోనే భట్టిప్రోలు కవి తన రచనలు చేశాడు. చాళుక్యుల కాలం లో , ఇక్ష్వాకుల కాలం లో తెలుగు ఎంతో అభి వృద్ధి చెందింది. జక్కన, గొన బుద్ధారెడ్డి (రామాయణం),గౌరన కవులు భక్తి రచనలు చేశారు. శ్రీనాధుని కావ్యాలు సుందరమైనవి మరియు అత్యంత ఆహ్లాదమైనవి. చిన్నయ సూరి తెలుగు వ్యాకరణాన్ని రాశాడు. ఆధునిక కవులలో రచయితలలో, విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు, నండూరిసుబ్బారావు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి,మహాకవి శ్రీశ్రీ , ధాశరథి క్రృష్ణమాచార్య,సురవరం ప్రతాపరెడ్డి సి. నారాయణ రెడ్డి,వరవరరావు ఇంకా ఎంతోమంది గొప్పవాళ్లున్నారు. సామాజిక సమస్యల పైన ప్రజలకు అవగాహన కలిపిస్తూ ఎన్నో కవితలు, వ్యాసాలు, గేయాలు రాశారు. ఇంత గొప్పభాష తెలుగు భాషాదినోత్సవం ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుతుంది. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 15 ను తెలంగాణా భాషా దినోత్సవంగా జరుపుతుంది...
Source : Internet and books

Comments

  1. తెలుగుభాష కన్నతల్లి వంటిది... అమ్మలేని జీవితం ఉండదు. మాతృభాష మాట్లాడనివారు ఉండరు... కావునా మనకు మనపై అభిమానం ఉన్నట్టే తెలుగుపై కూడా ఉండాలి... తెలుగురీడ్స్.కామ్

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Procedure to do Exploratory Data Analysis…