https://qr.ae/TWTa4H మన తెలుగు భాష గొప్పతనం-వ్యాసం మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు,ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. మనం తెలుగు భాష తక్కువ అని అనుకోకూడదు. తెలుగు భాష కి చాలా చరిత్ర ఉంది. తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది. అందులో ఎందరో కవులు, రచయితలు గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు. పర భాష లను గౌరవించడమే తెలుగు భాష, తెలుగు వారి గొప్పతనం. ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికాలోనూ , పశ్చిమ ఆసియా లోనూ,ఆంధ్ర,తెలంగాణ లోనూ జరుగుతాయి. తెలుగువారి మంచి మనసు, వేరే భాషలవారిని ఆదరించే గుణం లోనే తెలుస్తుంది తెలుగు తీపి, తెలుగు వారి గొప్పతనం. తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి. గొప్పవాళ్లు రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు ...
Comments
Post a Comment